పట్టుదలతో నడుస్తున్న మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి --- దిగ్విజయంగా కొనసాగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం

 దిగ్విజయంగా కొనసాగిస్తున్న - గడప గడపకు మన ప్రభుత్వం--- పట్టుదలతో నడుస్తున్న అవంతి.



భీమిలి నియోజకవర్గం మధురవాడ-- (ప్రజాబలం న్యూస్ ) - అడవివరం 05 - సచివాలయం కోడ్ (2106959 )- 16-04-2023 - బుద వారం



అడివివరం 05 సచివాలయం లో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో హుషారుగా నడుస్తోంది.


రెండవరోజు పర్యటన కు విచ్చేసిన అవంతి శ్రీనివాసరావు కి స్థానికులు అడగడుగునా సాదర స్వాగతం పలికి. పూల వర్షం కురిపిస్తున్నారు.


 ఈ పర్యటన లో బాగంగా (13 క్లస్టర్స్ ) 503 ఇళ్ళు గడప గడపకు వెళ్ళి నాలుగు ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన ను అవంతి ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు.


నాలుగేళ్ళ పాలనపై ప్రజలు అబిప్రాయం అడగగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా కూడా లంచం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులు అవంతి అందిస్తున్న పాలన వలన నేరుగా మా వద్దకే పాలన అందింస్తున్నందుకు చాలా సంతోషం గా ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అవంతి చెబుతున్నారు.


కోరాడ లో దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలు ను అవంతి అడగగా పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.


గాంధీ నగర్ - యస్సి బిసి కోలనీ - కాపుదిబ్బ కోలనీలో అవంతి శ్రీనివాసరావు దృష్టిలో పెట్టిన దీర్ఘకాలిక సమస్యలు


1) గాంధీ నగర్ లో సిసి రోడ్లు - డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులు చేపట్టాలని


2) యస్సి కోలనీ లో సామాజిక భవనం నిర్మాణం చేపట్టాలని*


3) డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టాలని* 


4) కాపుదిబ్బ యస్సి బిసి కోలనీ - గాంధీనగర్ - కాపుదిబ్బ మూడు కోలనీ వాసులు యూజీడి కనెక్షన్ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ) కల్పించాలని  


5) పలు కారణాలు చేత సంక్షేమ పథకాలు అమలు కాలేదు వాటిని మరల పునర్వపరిశీలన చేసి అందేలా చేయాలని


సమస్యలు విన్న అవంతి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు - తమ సమస్యలు పరిష్కారం కి శ్రీకారం చుట్టిన అవంతి కి స్థానికులు సంతోషం తో దన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు - వార్డు వైసిపి శ్రేణులు ఆయా పదవుల్లో ఉన్న వారు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.