పోతిన మల్లయ్య పాలెంపోలీస్ స్టేషన్ ఎస్.ఐ. సిహెచ్ వెంకటరావు కు సి.ఐ గా ప్రమోషన్.
మధురవాడ, --- (ప్రజాబలం న్యూస్) -- విధి నిర్వహణలో ఎంతో నిబద్ధత తో పని చేస్తూ మధురవాడలో వెంకట్రావు ఎస్ఐగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు సీఐగా పదోన్నతి లభించడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. విశాఖపట్నం రేంజి పరిధిలో ఎస్.ఐలుగా పనిచేస్తున్న పలువురికి సి.ఐలుగా పదోన్నతులు లభించాయి.అందులో భాగంగా పీ.ఎం.పాలెం పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. గా పనిచేస్తున్న సి.హెచ్.వెంకటరావు కి సి.ఐ.గా పదోన్నతి లభించడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. పి.ఎం పాలెం పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయినప్పటి నుండి ఇక్కడి నుండి ఎంతోమంది పోలీసు స్థాయి నుంచి హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్సై, సీఐ, డీఎస్పీ స్థాయి వరకు ప్రమోషన్లు వచ్చాయి. దీనికంతటివారు పనిచేసే ఈపోలీస్ స్టేషన్లో నిబద్ధత నిజాయితీతోోో పనిచేస. అనేకమైన అనుభవాలు చూశారు. అనుభవ పాఠాలు నేర్పిన ఈ పోలీస్ స్టేషన్ లో చిత్తశుద్ధితో పనిచేసే పోలీస్ అధికారులు గాపై స్థాయికి ఎదగడం పట్ల స్థానికంగా సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. బి గ్రేడ్ పోలీస్ స్టేషన్ గా పేరుపడిన ఈ ప్రాంతం లక్షలాది జనాభాతో నిండిపోయింది. ఎన్నో సమస్యలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని శాంతి భద్రతలను నెలకొల్పడంలో కీలక పాత్ర వహిస్తున్న పోలీసులు తమ కుటుంబాలను దూరంగా ఉంచి, రాత్రింబవళ్లు ప్రజల కోసం శ్రమించే రక్షక బటులకు ఇటువంటి ప్రమోషన్లు రావడం వారి నిబద్ధతకు నిజాయితీకి, అద్దం పడుతోంది. విశాఖపట్నం రేంజి పరిధిలో మొత్తం 17మంది ఎస్.ఐ.లకి పదోన్నతులు రాగా పీ.ఎం.పాలెం పిఎస్ లో విధులు నిర్వహిస్తున్న సి.హెచ్.వెంకటరావు ఆజాబితాలో ఉన్నారు.పదోన్నతి పొందిన ఎస్.ఐ.లను విశాఖపట్నం రేంజి డిఐజి కార్యాలయంలో హాజరుకావాలని ఆఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పదోన్నతి పొందిన వారికి 15రోజుల్లో కొత్త స్థానాల్లో నియమించనున్నారు.సి.ఐగా పదోన్నతి పొందిన వెంకటరావు కి పోలీసుశాఖ సిబ్బందితో పాటు మిత్రులు,శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేసారు.