జగనన్న ను మళ్లీ సీఎం చేసేంతవరకు నిద్రపోవద్దు--- కన్వీనర్లు, గృహ సారధులు కార్యకర్తలు సమావేశంలో అవంతి పిలుపు.

 భీమిలి నియోజకవర్గం --- ప్రజాబలం న్యూస్ -





మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసన సభ్యులుముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గం స్థాయి సచివాలయం కన్వినర్ లు - ఇంచార్జ్ లతో ఆనందపురం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు.


 ఈసమీక్ష సమావేశం లో బాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయం కన్వినర్ లకు సచివాలయ ఇంచార్జ్ లకు జీవిత భీమా తో పాటు ప్రమాథ భీమా సౌకర్యం కల్పించండంతో కన్వినర్ లు తమ తమ పేర్లు భీమా లో నమోదు చేసుకున్నారు.

.



అనంతరం ఈ కార్యక్రమంముఖ్య ఉద్దేశ్యాన్ని జగనన్న టీం వారు తెర పై చూపించడం చేసారు. ఈ భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన హామీలకు గానూ మాట తప్పకుండా మడం తిప్పకుండా నాలుగేళ్లు పాలనలో వివక్ష చూపకుండా, పైసా లంచం లేకుండా, ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకే అందించారని పేర్కొన్నారు..ప్రతీ గడప లో ఏదో ఒక పథకం అందుకోవడం జరిగిందని ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా ఎంత చెడుగా ప్రచారం చేసినా, ప్రజలు గుండెల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారనిఅన్నారు.మనం రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీ గెలుపుకోసం మన వంతు గా ఈ నాలుగు ఏళ్ళలో ప్రభుత్వం చేసిన మంచి పనులను సంక్షేమ పథకాలు అమలు పాలన ను ప్రజలకు మరింత చేరువ చేసేలా నాయకులు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు బాధ్యత తో ప్రజలు మద్యకు వెళ్ళి వారికి ప్రచారం చేయాలని,పార్టీ బలోపేతం కావాలంటే మనలో మనకి చిన్న చిన్న మనస్పర్థలు ఉంటాయి వాటిని పక్కన పెట్టి అంతా ఓకే తాటిపై నడిచి పార్టీ బలోపేతం కి కృషి చేయాలని,పార్టీ గెలిస్తే నే మనకు రాజకీయంగా, భవిష్యత్ తో రాజకీయ మనుగడ ఉంటాదని,మీరంతా పార్టీ కోసం ఎంతగా పని చేసారో, అందరి లిస్టురాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఉందని మాకు ప్రాధాన్యత లేదు మాకు ప్రాధాన్యత లేదు అని ఆలోచన వద్దు :ముందు వెనుక అంతే తప్పా అందరకి పదవుల్లో అయితే నేమి ఏ విషయం లోనైనా అవకాశాలు మెండుగా ఉంటాయని, పార్టీ అనేది ఓ వ్వవస్థ అప్పుడు పార్టీ కోసం పని చేసినట్లు రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిస్తూ భీమిలి నియోజకవర్గం ఎర్ర మట్టి దిబ్బలు పై కబ్జా అంటూ నాపై పలువురు చేస్తున్న ఆసత్య ప్రచారం చాలా ఆస్యాస్పందంగా ఉందని,నా రాజకీయ చరిత్ర లో నాటి నుంచి నేటి వరుకూ అవినీతి పై గాని లంచం పై గాని కబ్జా పై గాని చిన్నదైనా నిరూపిస్తే నా యంయల్ఏ పదవికి రాజీనామా చేస్తానని ఏవో లేనిపోని బురద జల్లుదామనుకుంటే ముందు మీ చేతులకు అది అంటుకుంటుంది అన్నారు. ఈ సందర్భంగా అవంతికి భీమిలి నియోజకవర్గం వైసీపీ పరిశీలకుడు బాలరాజులకు సాలువతో సత్కరించారు.


ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం వైసిపి శ్రేణులు - సచివాలయం లు - సచివాలయం ఇంచార్జ్ లు భారీ సంఖ్య పాల్గొన్నారు.