రాష్ట్రాన్ని రక్షిచండి దేశాన్ని కాపాడండి ---సిపిఐ పిలుపు.
మధురవాడ (ప్రజాబలం న్యూస్ )
జీవీఎంసీ మధురవాడ జోన్ 7 వ వార్డు కళానగర్ తదితర ప్రాంతాల్లో సిపిఐ ఇంటింటికి ప్రచారంనిర్వహించింది.
వైసీపీ రాక్షస, రౌడి పాలననుండి రాష్ట్రాన్ని రక్షంచండి బీజేపీ మతోన్మాద పాలననుండి దేశాన్ని కాపాడండి అన్న నినాదంతో సిపిఐ ఆగస్టు 17 నుండి సెప్టెంబరు 8 వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా లలో బస్ యాత్ర నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజుచెప్పారు.
ఆదివారం జీవీఎంసీ మధురవాడ జోన్ 7 వ వార్డు పరిధిలో కళానగర్ తదితర ప్రాంతాల్లో సిపిఐ కార్యకర్తలు ఇంటిఇంటికి కరపత్రాలు పంచుతూవిస్తృతంగా. ప్రచారం నిర్వహించారు.
పైడిరాజు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులతో భిన్నత్వం లో ఏకత్వం కలిగిన దేశ ప్రజలను విభజించి మత ప్రాతిపదికన మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పరిపాలన సాగిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్త చేస్తున్నదని, పోరాటాలు, త్యాగలు చేసి ప్రభుత్వ రంగంలో సాధించుకున్న విశాఖ ఉక్కును నిసిగ్గుగా అమ్మేస్తామని చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఏమాత్రం వ్యతిరేకత చెప్పకుండా తగుదునమ్మా అంటూ అమలు చేసి రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు, అదనపు వడ్డీలు, సర్ చార్జీలు పేరిట వసూలు చేస్తూ భారాలు మోపుతున్నారని విమర్శించారు. 4 వేలకు పైన విద్యార్థులున్న జాతీయ రహదారి పక్కనున్న చంద్రంపాలెం ఉన్నత పాఠశాలకు రోడ్ దాటుతున్నప్పుడు ప్రమాదాలు జరిగి విద్యార్థులు మరణించినా పట్టించుకోకుండా పై వంతెన నిర్మించి ఆదుకోవలసినదిపోయి ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసి మరింత దూరం తిరిగి వెళ్ళేటట్లు చెయ్యడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.రానున్న ఎన్నికల్లో రాష్టంలో వైసీపీ, కేంద్రంలో బీజేపి ప్రభుత్వాలను ఓడించి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏరియా పార్టీ కార్యదర్శి వి సత్యనారాయణ, ఎం డి బేగం, జి వేళంగినిరావు, ఎం ఎస్ పాత్రుడు, ఎన్ త్రినాధ్, కె చిన్న, డి సతీష్, నారాయణరావు టీడీపీ నాయకులు ఎన్ రాము, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.