ఓటర్ వెరిఫికేషన్ చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో భీమిలి టిడిపి ఇన్చార్జ్ రాజబాబు
మధురవాడ-- (ప్రజాబలం న్యూస్) విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలతో ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం పైసమావేశం సోమవారంఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో భీమిలి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు పాల్గొని భీమిలి నియోజకవర్గ ఓటర్లు వెరిఫికేషన్ పై చర్చించారు.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.