మానవసేవే మాధవసేవ --- సమాజ సేవలో యువత పాల్గొనండి -- రక్తదాన శిబిరంలో పిలుపునిచ్చిన సి.ఐ. రామచంద్ర రావు

 రక్తదానం చేద్దాం - సాటి ప్రాణాన్ని నిల బె డదాం -- సి. ఐ. రామచంద్ర రావు 



 భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం (రామవరం) - లో సోమవారం


మేము సైతం సేవా సంఘం వారు నిర్వహించిన 10 వ వార్షికోత్సవ వేడుకలు కు వార్షికోత్సవం లో బాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కు ముఖ్య అతిథిగా ఆనందంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

 ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం లో పదులు సంఖ్యలో యువకులు రక్తదానం చేశారు.


 రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు మాట్లాడుతూ మనం ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థాయి లో ఉన్నా,ఎన్ని సాధించినా,ఎంతటి వారికైనా విలువైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం మనలో ఉండే ప్రాణం అని పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలకు క్షణిక ఆవేశాలు కోపాలతో ఒకరిని ఒకరు చంపుకోవడం నేరం తో పాటు, వారీతో పాటు,ఉన్న అందరి జీవితాలు నాశనం అవుతాయని, కారణం ఏదైనా ప్రాణం పోతే తిరిగి రాదని, అలాంటి ప్రాణం తీయడంసులభమే అయినప్పటికీ, అదే ప్రాణం నిలపడానికి మానవత్వం తో కూడిన మంచి మనసు ఉండాలని,.యువకులు అంటే సరదా పార్టీలు ఆటలు పాటలు ఎంజాయ్ మెంట్ లు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ యువత రక్తదానం లో పాల్గొని పది మంది ప్రాణం నిలపడానికి మానవత్వం తో రక్తదానం చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని.యువతం ఆలోచించి, మంచికై పాటు పెడితే సమాజం ఎంతో బాగుంటుంది చెప్పారు. వీరిలా ప్రతీ ఒక్కరూ మంచి ఆలోచనలతో సమాజం కి మేలు చేసే కార్యక్రమాలు చేయాలనియువతకు సూచించారు.


అనంతరం ఆయన చేతులు మీదుగా పేదలకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో మేము సైతం సేవా సంఘం కార్యాచరణ వర్గం - వైసిపి శ్రేణులు పాల్గొన్నారు.