మణిభూషణ్ దర్శకత్వంలో స్మైల్స్ ఐలాండ్ విడుదల..

 మణి భూషణ్


దర్శకత్వం లో వెబ్ ఎపిసోడ్ "స్మైల్స్ ఐలాండ్ " విడుదల 

 మధురవాడ --- (ప్రజాబలం న్యూస్ )

నగరానికి చెందిన విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్, డిజిటల్ వీడియోస్ వారి నిర్వహణ లో దిగ్విజయంగా నడుస్తున్న వెబ్ ఛానల్ టీవీ టూరిజం వారి సమర్పణలో అత్యున్నత ప్రజాధారణ పొందిన వెబ్ సిరీస్ " మన టౌన్ లో "- భాగంగా ఎపిసోడ్ - 5 " స్మైల్స్ ఐలాండ్ " డెంటల్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వారి సేవలను ప్రపంచ పర్యాటకులకు, విశాఖ ప్రజలకు అవగహన పరిచే చిత్రం విడుదలకార్యక్రమం అంగరంగ వైభవంగామంగళవారం జరిగింది. జాతీయ టూత్ ఫెయిరీ డే ఆగస్ట్ 22 న జరుగుతున్నా సందర్బంగా ఈ చిత్రాన్ని టీవీ టూరిజం ఛానల్ లో ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ చేతులమీదుగా ముఖ్య అతిధి సన్ మూర్తి మరియు డాక్టర్ షాలిని , రంగనాయకులు మాస్టర్ లాంటి ప్రముఖల సమక్షం లో క్లిక్ చేసి విడుదల చేసారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న సన్ మూర్తి మాట్లాడుతూ పంటి సంరక్షణ అనేది చాల అవసరం అని , పిల్లలు , పెద్దలు ఆరోగ్యకర అలవాట్లద్వారా దంతాలను కాపాడుకోవచ్చని, అధునాతన వైద్యసేవలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు మణి భూషణ్ మాట్లాడుతూ పాలపళ్ళు ఊడినప్పుడు పురాతన కాలం లో వాటిని చెట్టు వద్ద చిన్న గొయ్యి తీసి పాతిపెట్టి మంచిపళ్ళు రావాలని దేవుడ్ని ప్రార్ధించేవారు. పళ్ళు అనేవి మన జీవన విధానం లో ప్రముఖ పాత్ర పోషిస్తూ వాటి రక్షణకు ఎన్నో ఏళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. అందుకే ప్రతి ఏటా నేషనల్ టూత్ ఫెయిరీ డే ని ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. విశాఖ నగరం లో అన్ని సదుపాయాలు కలిగిన అడ్వాన్స్డ్ డెంటల్ అండ్ కాస్మెటాలజీ సేవలు అందరికి తెలిసేలా ఈ చిత్రం పూర్తి అవగహన కలిగిస్తున్నదని వీరి సేవలు అందురు వినియోగించుకొని దంత సమస్యలకు పరిష్కారం పొందాలని కోరారు. ఈ చిత్రాన్ని టీవీ టూరిజం ఛానల్ లో వీక్షించవచ్చని తెలియజేసారు . ఈ సందర్బంగా డాక్టర్ షాలిని మాట్లాడుతూ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ వి టి టి ఎఫ్ వారు ఉచిత దంతవైద్య శిభిరం నిర్వహిస్తున్నారు, వారికీ కావలసిన అన్ని సదుపాయాలు అందిస్తున్నామని ,దంత సమస్యలు ఉన్నవారు ఎవరైనా ఈ కార్యక్రమం లో పాల్గొని ఈ ఉచిత సేవ వినియోగించుకోవాలని కోరుతున్నాం . ఎలాంటి దంత, కాస్మెటాలజీ సమస్యలు ఉన్న ఉచిత కన్సల్టేషన్ కోసం ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కాల్ చేసి 9848418582 మీ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్బంగా ఈరోజు ఈకార్యక్రమం అనంతరం పలువురు ఉచిత దంత వైద్య సేవలు వినియోగించుకున్నారు . ఈ కార్యక్రమం లో సీఈఓ సీతారామ స్వామి, ఎడిటర్ నీరజభూషణ్, హీరో నిర్మాత ఆదిత్యభూషణ్, మురళి , వెంకటరమణ,శాంతి , భారతమ్మ , లావణ్య,కిరణ్మయి , విజయ, లక్ష్మి , హేమంత్ , విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. 

విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్.

టీవీ టూరిజం ,

విశాఖపట్నం.

9848418582