మధురవాడ (ప్రజా
బలం న్యూస్ )--- మధురవాడ ప్రాంతంలో శ్రావణ మాసవరలక్ష్మీ వ్రతం పూజలు రెండవ శ్రావణ శుక్రవారం ఇంటింటా, వాడ వాడలా, ప్రతి హిందూ దేవాలయంలోఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు చేశారు. ఎవరి శక్తి మేరకు వారు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనేక రకాల వంటకాలు, పండ్లు,పూలు, చీర రవికలు, పసుపు, కుంకుమ,ధూప, దీప నైవేద్యాలు అమ్మవారి సమర్పించుకొని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. సప్తగిరి కాలనీలో శివ కుటుంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సామాజిక సేవకులు, ఆలయ ధర్మకర్త పి కాశీ రావు ఆధ్వర్యంలో శ్రావణ మాస వరలక్ష్మి వ్రత పూజలు చేశారు.కొడుకులు, కోడళ్ళు, మనమల, తో పాటు కుటుంబ సమేతంగా వ్రతమాచరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసే ప్రసాదాలు పంపిణీ చేశారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే చంద్రంపాలెం రామ లక్ష్మణ లారీ ట్రాన్స్పోర్ట్ -- బ్రదర్స్ ఆధ్వర్యంలో వారి సతీమణులు ఇద్దరు వరలక్ష్మీ వ్రతం పూజలు ఎంతో భక్తి శ్రద్దలతో వారి ఇంటిలో ఘనంగా నిర్వహించారు. ఇలా ప్రతి ఇంటిలోనూ వరలక్ష్మి తల్లికి ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు.