ఉత్సాహంగా జనసేన పవర్ లీగ్ క్రికెట్ పోటీలు-- పవన్ కళ్యాణ్ వీరాభిమాని నక్కాని శ్రీధర్ ఆధ్వర్యంలో

 ఉత్సాహంగాప్రారంభమైన జనసేన పవర్ లీగ్ క్రికెట్ పోటీలు


 భీమిలి నియోజకవర్గం--

మధురవాడ--- ప్రజాబలం న్యూస్ --

ఆగస్టు 26



జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 26 నుండి సెప్టెంబర్ 2 వ తేది వరకు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు శ్రీ జగదభి రామ కన్స్ట్రక్షన్స్ అధినేత నక్కా శ్రీధర్ ఆర్థిక సహకారంతో జనసేన పవర్ లీగ్ క్రికెట్ పోటీలు,భీమిలి దగ్గర గల మంగమూరిపేట వద్ద భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి శివశంకర్ చేతుల మీదుగా శనివారoప్రారంభించారు. క్రీడాకారులకు టీ షర్ట్ లను అందజేశారు అనంతరం ట్రోఫీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ ఈ క్రీడా పోటీల వల్ల జన సైనికులకు టీమ్ స్పిరిట్ , నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ,వంటివి పెరుగుతాయని జనసైనికులలో నూతన ఉత్సాహం పెరుగుతుందని ఈ పోటీలలో 16 జట్లు పాల్గొంటున్నాయి. భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి పంచకర్ల సందీప్, పీలా రామకృష్ణ, సంకు వెంకటేశ్వరరావు, నక్కా శ్రీధర్ , బి వి కృష్ణయ్య, ఈ ఎన్ యస్ చంద్రరావు, సంతోష్ నాయుడు, పోతిన అనురాధ, పి భువనేశ్వరి ,శాఖరి శ్రీనివాస్, వాండ్రాసి శ్రీను, భీమిలి నియోజకవర్గ అన్నివార్డుల కోఆర్డినేటర్లు జనసేన అభిమానులు పాల్గోన్నారు.