గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో తొలి రోజు ఉత్సాహభరితంగా విశాఖ ఎంపీ ఎం. వి. వి -- తూర్పు ఎమ్మెల్యేగా బరిలో నిలబడునున్న ఎం వి వి.

విశాఖ పార్లమెంట్


సభ్యులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త MVV సత్యనారాయణ గారు ఈ రోజు 9వ వార్డు కార్పొరేటర్ ఉమ్మిడి స్వాతి దాస్ గారి ఆధ్వర్యంలో 9వ వార్డు జోడుగుళ్లపాలెం జంక్షన్ నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బా రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గోలగాని హరి వెంకట కుమారి గారు, వార్డు కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.