మధురవాడ---
(ప్రజాబలం న్యూస్ )-- వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో మధురవాడ శిల్పారామం జాతరలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేశాయి. నగరానికి చెందిన నాట్య తరంగణి అకాడమీ వారిచే ప్రదర్శించబడిన శాస్త్రీయ జానపద నృత్య ప్రదర్శనలు శ్రోతులను ఉర్రూతలూగించాయిమూషిక వాహన, మహాగణపతి, అదివో అల్లదివో హరివాసం, ఇదిగో భద్రాద్రి, కొలివైతివా, దశావతారాల తదితర నృత్య ప్రదర్శనలను నృత్య కళాకారులు. విష్ణువర్ధన్, సాద్వి, రాణి, చంద్రావతి, మాధురి,దివ్య,,చందు, ఇందు, తదితరులు నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. నృత్య దర్శకత్వం లీలావతి వహించగా, శిల్పారామం అధికారివిశ్వనాథరెడ్డి
పర్యవేక్షించారు.