ఘనంగా శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట.
ఆధ్యాత్మిక, సామాజిక సేవ,తోనే మానసిక ప్రశాంతత .!
మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.
కాశీ విశ్వేశ్వర స్వామి,ఆలయప్రతిష్ట సందర్భంగా మొళ్లి లక్ష్మణరావు ఆర్థిక సహకారంతో సుమారు 3500మంది భక్తులకు భారీ అన్నసంతర్పణ.
మధురవాడ:--- ప్రజాబలం న్యూస్ --= మధురవాడ,కొమ్మాది జం,, వికలాంగుల కోలనీ,లో సోమవారం శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట (గణపతి,పార్వతీదేవి, నాగబంధం,సుబ్రహ్మణ్య స్వామి,నందీశ్వరుడు, అయ్యపస్వామి,షిరిడిసాయి, నవగ్రహ మరియు ధ్వజస్తంభం విగ్రహాల ప్రతిష్ఠ) కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా టి.డి.పి.రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి మొళ్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో అతి భారీ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు,7వ వార్డ్ కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, సీనియర్ నాయకులు పిల్లా వెంకట్రావు,టిడిపి పార్లమెంటరీ8 ఉపాధ్యక్షులు వాండ్రాసి అప్పలరాజు,మహిళ నాయకురాలు బోయి రమాదేవి,పార్లమెంటరీ ఉపాధ్యక్షులు బోయిశ్రీనివాస్, భీమిలి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీనివాస్, 6వర్డ్ వార్డ్ టిడిపి అధ్యక్షులు దాసరి శ్రీనివాస్,ఈగల రవి కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తీర్థ ప్రసాదములు స్వీకరించారు.ఈసందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని,ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సామాజిక,ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాల్లో యువత అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువతకు తమగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని,సామాజిక సత్ప్రవర్తనతో..మెలగాలని కోరారు...
యువత అధ్యక్షులు కొండపు రాజు,ఆవాల నీలయ్య, బొడ్డేపల్లి రంగారావు,పాపారావు,ఆలయ కమిటీ సభ్యులు పి.వి.రమణమూర్తి, సబ్బవరపు సూర్యనారాయణ, ఉద్దండ లక్ష్మి,సిరికి నర్సింగరావు,చింతాడ రామకృష్ణ వరప్రసాద్,బోని నరసింహ మూర్తి(రాజు),పుచ్చకాయలు లక్ష్మి,కాకిలక్ష్మిబాయి,మొల్లుల వెంకట లక్ష్మీ,సీరపు కొండమ్మ,సూర్య,ఈశ్వరమ్మ, అరుణ జ్యోతి, బోని హేమలత తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.