ప్లాటినం జూబ్లీ ఉత్సవం లో పైలాన్ స్థూపం ఆవిష్కరించిన మాజీమంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.
మధురవాడ ---ప్రజాబలం న్యూస్.
ఆంద్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పడి 70 సం వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భం గా పియంపాలెం వైయస్సార్ స్టేడియం లో పైలాన్ స్థూపం ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని సోమవారం ఆవిష్కరించారు.ఆంద్ర క్రికెట్ అసోసియేషన్ వారి ఆద్వర్యం లో
నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవంతి మాట్లాడుతూ పాశ్చాత్తు దేశం అయినా బ్రిటీష్ వారు మన దేశాన్ని పరిపాలించే కాలంలో క్రికెట్ ను ఓ విధంగా ఆడేవారని, వెళ్ళిన తరువాత మనదేశం కూడా క్రికెట్ ఆడటం ప్రారంభించి భారతదేశంలో క్రికేట్ అంటే ఓ మతం గా భావించే స్థాయికి ఎదగడం మన అందరికి తెలిసిన విషయమే అని పేర్కొన్నారు. దేశ క్రికెట్ అసోసియేషన్ లో భాగమైన మన ఆంద్ర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ 1953 సం లో ఆవిర్భవించి నేటికి 69 వసంతాలు పూర్తి చేసుకుని 70 వ వసంతంలోకి అడుగుపెట్టడం మన వైయస్సార్ స్టేడియం లో పైలాన్ స్థూపం ఆవిష్కరణ నా చేతులు మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషం గా ఉందని,మన ఆంద్ర ప్రదేశ్ నుంచి దేశం తరుపున ఎంతో మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం, మన అందరికి చాలా గర్వకారణం అని చెప్పారు.ఈ సుదీర్ఘ క్రికెట్ లో దేశానికి 1983 వ సం లో 2011 వ సం లో అంతర్జాతీయ కప్ లను కైవసం చేసుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు. రాబోయే 2024 వరల్డ్ కప్ లో కూడా మన క్రీడాకారులు తమ ప్రతిభను కనిపరచి దేశానికి మూడో అంతర్జాతీయ కప్ ను అందించాలని, ఆకాంక్షిస్తూ పైలాన్ స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం శాశనసభ్యులు గా, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న,భీమిలి లో గల వైయస్సార్ స్టేడియం లో ఏర్పాటు చేసినందుకు క్రికెట్ అసోసియేషన్ వారికిప్రత్యేక ధన్యవాదాలుతెలిపారు.
ఈ కార్యక్రమంలో బిసిసిఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడు ముత్యాలనాయుడు- మాజీ క్రికెటర్ మదన్ లాల్ - ఏసియే కార్యదర్శి గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.