మధురవాడ--- ప్రజా
బలం న్యూస్ --- జీవీఎంసీ 8 వవార్డు పరిధి మిథిలాపురి ఉ డా కాలనీలో గల మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణలో రెండో రోజు దస్తావేజు లేఖరుల పెన్ డౌన్ సమ్మె కొనసాగింది. తొలి రోజు దస్తావేజు లేఖర్ల వారి వారి కార్యాలయాలలో పెన్ డౌన్ సమ్మె నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా చేశారు.గురువారం ఉదయం జరిగిన పెన్ డౌన్ సమ్మెలో దస్తావేజు లేఖర్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తమ పొట్టను కొట్టి-- ప్రేమ్2.0 అను సాఫ్ట్వేర్ ని ప్రవేశపెట్టి ఫార్మిట్ ప్రకారం ఆన్లైన్లో దస్తావేజులు తయారు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఈ విధానం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూసి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లోప భూ ఇష్టమైన ఈ విధానం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. స్టాంప్ పేపర్ లేకుండా, ఫార్మిట్ ప్రకారం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నిర్వహించడం,ప్రజలే స్వయంగా దస్తావేజును ఫార్మేట్ ప్రకారం ఆన్లైన్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, ఫీజులు చెల్లించడం, దస్తావేజులలో సంతకాలు లేకుండా కేవలం ఆధార్ వేలిముద్రలతో రిజిస్ట్రేషన్ చేయించడం, దస్తావేజును పార్టీలకు ఈమెయిల్ చేయడం, దస్తావేజులను డీజీ లాకర్ నందు భద్రపరచడం వలన రిజిస్ట్రేషన్ చేయించుకునే కక్షి దారులకు ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. ఈ ప్రక్రియ వలన న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని, ఆస్తులు కొనుగోలు అమ్మకాలు జరిపేటప్పుడు అనేక వివాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు, ఇటువంటి రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు నిరక్షరాశులు మోసపోయే అవకాశం ఉందని అటువంటివి జరగకుండా రిజిస్ట్రేషన్లు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమకు న్యాయం చేయాలని కోరారు.