శ్రీ భూనీలా వెంకటేశ్వర స్వామి దేవాలయ ధర్మ కర్త సాయి లీలా, లక్ష్మణ మూర్తి దంపతులు ఆధ్వర్యంలో 108 మంది మహిళలతో శ్రీ మహాలక్ష్మి సహస్ర నామ అష్టోత్తర సుహాసిని కుంకుమ పూజ.
మధురవాడ: ---- ప్రజాబలం న్యూస్--
మధురవాడ మితిలాపురి ఉడాకాలనీ వినాయక కొండపై వెంచేసి వున్న శ్రీ భూనీలా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్బంగా దేవాలయ ధర్మ కర్త సాయి లీలా, లక్ష్మణ మూర్తి దంపతులు ఆధ్వర్యంలో 108 మంది మహిళలతో శ్రీ మహాలక్ష్మి సహస్ర నామ అష్టోత్తర సుహాసిని
కుంకుమ పూజ చాలా ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమం ఆలయ ప్రధాన పూజారి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి ఆలయ ధర్మకర్త సాయి లీలా మాట్లాడుతూ 5ఏళ్ళ నుండి ప్రతీ ఏడాది శ్రావణ మాసంలో 3వ శుక్రవారం 108 మంది మహిళలతో శ్రీ మహాలక్ష్మి సహస్ర నామ అష్టోత్తర సుహాసిని కుంకుమ పూజ నిర్వహిస్తున్నామని ఈ పూజలో పాల్గొన్న మహిళలకు పసుపు కుంకుమతో చీర జాకెట్టు తాంబూలంగా ఇచ్చి వారి ఆశీస్సులు పొందుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చక్రధర రావు, ఎం వెంకటరావు తదితర సభ్యులు పాల్గొన్నారు.