మధురవాడ -
-- ప్రజాబలం న్యూస్ -- అతి చిన్న వయసులోనే ఓ బాలుడు మూడు నిమిషాలలో ఏక దాటిగా1000 కరాటే పంచులు కొట్టి. కరాటి ఆన్లైన్ పోటీలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ 2023సాధించిన పిల్లా లక్ష్మీనారాయణ (12 సంవత్సరాల బాలుడు ) కు అవార్డును ఆదివారం అందజేశారు. 6 వ వార్డు పరిధి రేవెళ్లపాలెంలో అణుక్ బిల్డర్ అపార్ట్మెంట్ ఆవరణలో లక్ష్మీనారాయణకు అభినందన సభ జరిగింది.ఈ సందర్భంగా డ్రాగన్ ఫిట్ ఫిట్నెస్ సెంటర్ శిక్షకుడు మాస్టర్ పి. కనకారావు మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ ఫ్లోరా కన్స్ట్రక్షన్ అధినేత కంప హ నోకు లక్ష్మీనారాయణకు అవార్డును అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులు, స్థానిక నివాసితులు ఆ బాలుడిని అభినందించి మున్ముందు మరింత అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు.అనంతరం మధురవాడ సీనియర్ పాత్రికేయులుఆంధ్రజ్యోతి శ్రీనివాస్,ఈనాడు శ్రీనివాస్,సాక్షి రామనాయుడు, ప్రజాశక్తి శ్రీనివాస్, వైజాగ్ ఎక్స్ప్రెస్ శ్రీనివాసు లకు గౌరవ పూర్వకంగా సన్మానం చేశారు. లక్ష్మీనారాయణ తండ్రి సీనియర్ ఫోటోగ్రాఫర్ పిల్లా వాసుదేవరావు ఈ కార్యక్రమానికి వచ్చి తన కుమారుడిని అభినందించిన,ఆశీర్వదించిన, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.