అనకాపల్లి --- ప్రజాబ
లం న్యూస్ ---జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర బంద్ కి అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు మద్దతుగా జనసైనికులతో ర్యాలీ గా వెళ్లి పాల్గొన్నారు.ఈ సందర్బంగా జనసేన పార్టీ కార్యాలయం నుండి అనకాపల్లి పట్టణం నాలుగు రోడ్లు జంక్షన్, రింగ్ రోడ్ జంక్షన్, రైల్వే స్టేషన్, అండర్ బ్రిడ్జి, ఎమ్మార్వో ఆఫీస్, శారదా బ్రిడ్జి, రూరల్ పోలీస్ స్టేషన్, కొత్తూరు జంక్షన్ మీదుగా ర్యాలీ గా వెళ్లి షాపుల యజమానులతో మాట్లాడి షాపులు మూసివేయించారు. ఈ సందర్బంగా పోలీసులు భారీ గా ర్యాలీ వెంట వచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు,జనసైనికులు పాల్గొన్నారు.