అకారణంగా తొలగించిన కార్మికురాలు పద్మను విధుల్లోకి తీసుకోవాలి.సి ఐ టి యు..
మధురవాడ--- ప్రజాబలం న్యూస్ ---
ఏ పి ఎస్ ఆర్ టి సి మధురవాడ డిపో మేనేజర్ కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించే బాధ్యత విస్మరించడం అన్యాయమని ఏ పి ఎస్ ఆర్ టి సి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల యూనియన్ సి ఐ టీ యు గౌరవ అధ్యక్షులు వి తులసి రామ్ అన్నారు.డిపో లో తొమ్మిది సంవత్సరాల కాలం నుండి పని చేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం జీతాలు ఇవ్వాలని మేనేజర్ గారికి వినతి పత్రం ఇచ్చినందుకు ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ కార్మికురాలు సాంబా రపు పద్మను విధుల నుండి అన్యాయంగా తొలగించారని, ఈ అమానుష చర్యను నిరసిస్తూ మధురవాడ డిపో వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా తులసి రామ్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ ఆర్టీసీ నిర్ణయించిన జీతాలు ఇవ్వక పోయినా డిపో మేనజర్ పట్టించుకోవడం లేదని తెలియజేశారు.కార్మికులు సహజంగా నేడున్న ధరల కు అనుకూలంగా జీతాలు పెంచమని డిమాండ్ చేయాలన్నారు.కానీ ఇవ్వవలసి వేతనం లో కాంట్రాక్టరు అన్యాయంగా దోచుకుంటున్న మెనేజర్ అడగక పోవడం వెనుక మర్మం ఏమిటి అని ప్రశ్నించారు. ఆర్ టి సి సర్క్యులర్ ప్రకారం జీతాలు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చినందుకు,
పద్మను విధుల నుండి తొలగించడం ద్వారా మిగతా కార్మికులను బెదిరించడమేనని అన్నారు. కార్మికులకు ఇంత అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు.కార్మికురాలు పద్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్ట్ కార్మికుల కు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని కోరారు.అంత వరకు దోపిడీ లేకుండా కార్మికులకు ఇవ్వవలసిన జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.లేకా పోతే పోరాటం ఉదృతం చేస్తామని తెలియ జేశారు.కార్యక్రమం అనంతరం డిపో మేనేజర్ ఉమ మహేశ్వర రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జోన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి కొండమ్మ, పి రాజు కుమార్,
డిపో కమిటీ నాయకులు బి ఎస్ నారాయణ,ఎస్ భాస్కరరావు,భద్యురాలు ఎస్ పద్మ,పి సాగర్,డి భాస్కర్,పి సాయి శ్రీనివాస్, ఎం శివ,అర్ ఆదిలక్ష్మి,టి లక్ష్మి,జీ బంగా రమ్మ తది తరులు పాల్గొన్నారు.