బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో మధురవాడ జర్నలిస్టులకు రాఖీ పండగ.

 మధురవాడ (ప్రజాబలం న్యూస్ )-- మధురవాడ శిల్పారామం జాతరలో శుక్రవారం సాయంత్రం ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మధురవాడ ప్రాంత బాధ్యులు సంధ్య ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా రక్షాబంధన్ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మధురవాడ ప్రాంత జర్నలిస్టులకు సోదర భావాన్ని పెంపొందించే విధంగా వారి విజయాన్ని, వారి క్షేమాన్నికోరుకుంటూ సోదరి సంధ్య తమ సంస్థ ఆధ్వర్యంలో రాఖీ కట్టి జర్నలిస్టు సోదరులకు బొట్టు పెట్టి స్వీట్లు అందజేసి రాఖీ పండుగ విశిష్టత తెలియజేసింది. ఈ సందర్భంగా ఆమెకు అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.