28 వ వార్డులో 1086170 నెహ్రూనగర్ సచివాలయంలో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ ఎం.పి ఎం.వి.వి సత్యనారాయణ...
మధురవాడ జోన్2--- ప్ర
జాబలం న్యూస్ --
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గం 28 వ వార్డు ఇంఛార్జ్ పల్ల దుర్గా రావు ఆధ్వర్యములో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వము లో భాగంగా విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, ఎం వి వి సత్యనారాయణ . స్థానిక నాయకులు తో కలిసి రాంనగర్ నెహ్రూనగర్, ప్రాంతాలలో కలిసి పర్యటించారు.ఈ కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ఏపీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కంటే ముఖ్యమంత్రి ఇవ్వని హామీలు కూడా నెరవేర్చుతూ ప్రజలకు దగ్గరవుతున్నారని మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి జగన్ అన్నని పేర్కొన్నారు.