స్టీల్ ప్లాంట్ పరి రక్షణ కోరుతూ గోడా పత్రిక విడుదల.
మధురవాడ--- ప్రజాబలం న్యూస్ ---
ఈ నెల 20 వ తేదీ నుంచి సీపీఎం ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర మోటారు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు సిపిఎం మధురవాడ జోన్ కమిటీ తెలియజేసింది.మంగళ వారం కొమ్మాథి స్వయంకృషి నగర్ సి ఐ టీ యు కార్యాలయం వద్ద ఈ యాత్ర ను జయప్రదం చేయాలని ముద్రించించిన గోడ పత్రికను విడుదల చేశారు.ఈ సందర్భంగా జోన్ కార్యదర్శి డి అప్పలరాజు మాట్లాడుతూ కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం,ప్రధాని నరేంద్ర మోడీ మన రాష్ట్రం లోనే అత్యంత పెద్ద పరిశ్రమ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్ముతూ ఉంటే,దానిని ఎదుర్కోవలసిన రాష్ట్ర ప్రభుత్వం,ప్రధాన ప్రతి పక్షాలు జనసేన, టీ డీ పీ లు తగిన విధంగా పోరాటాలు నిర్వహించడంలో చొరవ చూపడం లేదని అన్నారు.
స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం సీపీఎం నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర మోటారు సైకిల్ యాత్ర ఈ 20 నుండి 29 వరకు జరుగు తు దాని తెలియ జేశారు.29 న స్టీల్ ప్లాంట్ తృష్ణ గ్రౌండ్స్ లో భారీ భహిరంగ సభ జరుగుతుందని తెలియ జేశారు.మన దేశ సంపద రక్షణ కోసం జరిగే ఈ యాత్ర లో పెద్ద యెత్తున ప్రజలు పాల్గొని మద్దతు తెలియ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జోన్ నాయకులు పి రాజు కుమార్, డి కొండమ్మ టీ కే శారద, బి భారతి,పాల్గొన్నారు.
