మధురవాడ లో భారీ సంఖ్యలో.. పాల్గొన్న టిడిపి జనసేన నేతలు కార్యకర్తలు.

 మధురవాడ లో చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ జాతీయ రహదారిపై ధర్నా,రాస్తారోకో.



 మధురవాడ---- ప్రజాబలం న్యూస్ ---


 ఇది దుర్మార్గపు ప్రభుత్వం --

మొల్లి లక్ష్మణరావు.

టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి. 




 రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి కోరాడ రాజబాబు ఆదేశాల మేరకు టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో రాష్ట్రబంద్ లో భాగంగా సోమవారం ఉదయం మధురవాడ కొమ్మాది ప్రధాన కూడలిలో రాస్తారాకో చేశారు.ఈసందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ..టీడీపీ ఎప్పుడూ ప్రజా సంక్షేమానికి పరితపించే పార్టీ అని,వైకాపా ప్రభుత్వం అది చూసి ఓర్వలేక చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు.చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని,స్వచ్చందంగా మద్దతుగాఉన్నారని అన్నారు.ఒక్క అవినీతి ఆరోపణలు లేకపోయినప్పట్టకి కనీస ఆదారాలు కూడాలేని కేసులో చంద్రబాబునాయుడుకు బెయిల్ రాకపోడానికి ప్రధాన కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని ఆరోపించారు.ధర్నాకు భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ పంచకర్ల సందీప్, ఈ.ఎన్.ఎస్.చందర్రావు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. 

రాస్తా రోకో చేస్తున్న టీడీపీ నాయకులను,స్థానిక టిడిపి ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పీ.ఎం.పాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు.అరెస్టయినవారిలో మొల్లి లక్ష్మణరావు,నమ్మి శ్రీను,ఈగల రవి,దాసరి శ్రీను,శెట్టిపల్లి గోపి, ఉప్పులూరి గోపి,గొల్లంగి ఆనందబాబు,నాగోతి వెంకటసత్యనారాయణ,బోయ శ్రీనివాసరావు,బోయ రమాదేవి, కానూరి అచ్యుతరావు, పోలిశెట్టి నాగేశ్వరావు, కొండాపు రాజు,సరస్వతి,గరే గురునాథ్(కె.వి.ఆర్.),నోడగల భవాని,పోతిన నాయుడు, దాదిశ్రీను,జెపి రాజు(ఐ టి.డి.పి.) తదితరులు ఉన్నారు.