ఫిష్ ల్యాండింగ్ జెట్టి నిర్మాణానికి స్థల పరిశీలన --- మత్స్యకారులకు అండగా-- సీఎం జగన్ భీమిలిఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు
మధురవాడ--- ప్రజాబ
లం న్యూస్ --
భీమిలి లో గల మత్స్య కారులు వ్యాపార సౌకర్యార్థం ఫిష్ ల్యాండింగ్ జట్టి నిర్మాణం చేపట్టాలని గతంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ని మత్స్యకారులు కోరడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టడంతో దానికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గత రెండు నెలలు క్రిందట జెట్టి నిర్మాణం కై నిదులు మంజారు చేయగా అవంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ సిబ్బంది, ఫిషింగ్ శాఖ సిబ్బంది తో నిర్మాణం కై స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా
అవంతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాలు తో పాటు మత్స్య కారులు కు అన్ని విధాలా పెద్ద పీట వేసారని, ఫిషింగ్ ల్యాండింగ్ జెట్టి నిర్మాణం వలన చుట్టుపక్కల మత్స్య కారులు అందరికి తుఫాన్ లు సంభవించే సమయంలో పడవలు వేట బోట్లు కట్టుకోవడానికి అలాగే చేపలు అమ్మకాలు లావాదేవీలు చేసుకోవడానికి సరైన మార్గం లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని అలా పడకుండా చాలా సౌకర్యవంతంగాఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం ఈ జట్టి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు కు ఆదేశాలు జారీ చేశారు.
అవంతి గచొరవతో పిష్ ల్యాండింగ్ జెట్టి నిర్మాణం కి శ్రీకారం చుట్టడం చాలా సంతోషం గా ఉందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తే అవంతిక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు - వైసిపి శ్రేణులు పాల్గొన్నారు.
