కోరాడ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో భారీ సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు

 30 వ రోజు నిరాహార దీక్షా శిబిరాన్ని నిర్వహించిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబు  


 మధురవాడ--- ప్రజాబలం న్యూస్ -- భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో .ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తన జీవిత ఆశయంగా , వారికి అన్ని విధాలుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని స్కీల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేసి కొన్ని లక్షల మంది పేద విద్యార్థులకు వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించి వారి ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి , అభివృద్ధికి కృషి చేసిన మా ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ భీమిలి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 30 వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని భీమిలి రూరల్ మండల పార్టీ నాయకురాలతో నిర్వహించారు. వారితోపాటు భీమిలి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు డి ఏ ఎన్ రాజు రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అప్పలనాయుడు, మీసాల సత్యనారాయణ, పార్లమెంట్ సెక్రెటరీ సరగడ అప్పారావు, నియోజకవర్గ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు యరబాల అనిల్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి గుండు చిన్న బాబు,తాళ్లవలస ఎంపీటీసీ కోరాడ రమణ, రాష్ట్ర మత్స్యకార సాధికార కమిటీ సభ్యురాలు వాసుపల్లి పోలమ్మ, విశాఖ పార్లమెంట్ తెలుగు మహిళ ఆర్గనైజింగ్ సెక్రటరీ మోటూరి కనక రత్నం, మండల ప్రధాన కార్యదర్శి గరికిన పరశురాం, విశాఖ పార్లమెంట్ మత్స్యకారి సాధికార సమితి సభ్యులు మైలపల్లి లక్ష్మణరావు,


నియోజకవర్గ నాగవంశం సాధికార కమిటీ అధ్యక్షులు సంకరభుక్త ప్రకాష్ గారు టిఎన్ఎస్ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కంబపు శివ అవనామం పార్టీ అధ్యక్షులు చుక్క ఆదిరెడ్డి రెండో వార్డ్ ఉపాధ్యక్షులు జగన్నాథం గణేష్ రెడ్డి గారు మూడో వార్డ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొక్కిరి అప్పన్న, తదితర నియోజకవర్గ మండల ముఖ్య నాయకులు దీక్షలో పాల్గొన్నారు.