వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆ ధ్వర్యంలో4000 మంది భక్తులకు ప్రసాద వితరణ ..
February 27, 2025
(విశాఖపట్నం - ప్రజా బలంన్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో 4000 మంది భక్తులకు ప్రసాద వితరణ:
మహాశివరాత్రి పర్వదినమున జాగరణ చేసి సాగర తీరం నందు స్నానమాచరించి అప్పుఘర్ ప్రక్కనగల శ్రీ సీతారామ సాగర లింగేశ్వర స్వామి వారి ఆలయ దర్శనమునకు వచ్చిన సుమారు 4000 మంది భక్తులకు పులిహోర మరియు కేసరి ప్రసాదముగా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ జోన్ చైర్ పర్సన్ గోగుల కమల్ కుమార్ కి శాలువాతో సత్కరించడం జరిగినది.అబ్జర్వర్ గా విచ్చేసిన ఎం శ్రీనివాస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కి కండువాతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమములో క్లబ్ అధ్యక్షులు వాసవియన్ ఏవి రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి Vn వెంకటరమణమూర్తి, కోశాధికారి Vn చంద్రశేఖర్ గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ గారు, ప్రోగ్రాం చైర్ పర్సన్ Vn శివరామకృష్ణ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ ప్రసాద వితరణ కార్యక్రమములో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ధన రూపేన ,వస్తు రూపేనా, సేవ రూపేనా సహాయ సహకారములు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.