వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా మహాశివరాత్రి పర్వదిన శివ పూజలు.
February 27, 2025
విశాఖపట్నం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) మహాశివరాత్రి సందర్భంగా ఎంవివి సిటీ నందు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ నిర్వహణలో మహా శివలింగమునకు మహన్యాస పూర్వక త్రై రుద్ర పారాయణ శాస్త్రోక్తముగా, వేదమంత్రాలతో బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అత్యంత వైభవంగా జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో ఎం వి వి సిటీ నివాసితులు అందరూ ఈ రుద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వయంగా శివుని పాదాల చెంత శివలింగమునకు వివిధ ద్రవ్యములతో అభిషేకం చేసి, తీర్థ ప్రసాదములు తీసుకోవడం జరిగింది. ఈ రుద్రాభిషేకం లో పాల్గొన్న వారికి వారి కుటుంబ సభ్యులకు సాయి మహాశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ... సదా శ్రీ సాయి వాసవి మాత పదసేవలో🙏🏽
క్లబ్ అధ్యక్షులు.
ఏవి రామకృష్ణారావు
.