రక్తదాతలకు అభినందనలు తెలిపి తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు
February 16, 2025
విశాఖపట్నం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, పిలుపుమేరకు విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతమైంది.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొని నిర్వాహకులను అభినందించారు . రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లేనని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు.. మెగా రక్తదాన శిబిరాలు తగరపువలస నుండి స్టీల్ ప్లాంట్ వరకు వివిధ కేంద్రాల్లో 1016 రక్తదాతల పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరాలలో ఒకటైన ఎంవిపి సర్కిల్ దగ్గర గల సమతా కాలేజీ రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే వెలగపూడి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా. ఎమ్మెల్యే కి గవర్నర్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి201 A వి. అమరనాథ్ తమ్మన మాట్లాడుతూ, వాసవి క్లబ్ యొక్క సేవా కార్యక్రమాల్లో భాగంగా 1,000 యూనిట్ల రక్తాన్ని సేకరించే లక్ష్యంతో ఈ మహా రక్తదాన శిబిరాన్ని తలపెట్టి లక్ష్యాన్ని 1016 మందికి అధికమించామని తెలిపారు.
ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా సేకరించిన రక్తాన్ని విశాఖపట్నంలోని వివిధ బ్లడ్ బ్యాంకులకు ఉచితంగా అందించి, రానున్న వేసవి కాలంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి అందజేయాలన్న సంకల్పం సఫలీకృతమైనది.
ప్రజలందరికీ ఇచ్చిన పిలుపు మేరకు
యువత, యువకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి రక్తదానం యొక్క విలువను చాటి చెప్పారు.
• “ఒకరు రక్తదానం చేస్తే, ముగ్గురి ప్రాణాలను రక్షించినట్లే!” అన్న విషయం గుర్తెరిగి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సామాజిక బాధ్యతగా రక్తదానం చేసిరి.
ఈ మెగా రక్తదాన కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంచేందుకు చేసిన మీ సహకారం అమూల్యమైనది.
మీ విలువైన సహాయ సహకారాలతో ఈ మహత్తర సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V 201A గవర్నర్ తమ్మన అమర్నాథ్... నేతృత్వంలో కలిసికట్టుగా పనిచేసిన జిల్లా టీం లీడర్లకు, మరియు అన్ని వాసవి క్లబ్ సభ్యులకు ప్రత్యేకించి మీడియా మిత్రులకు, సమతా కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస రావు కీ, మేనేజ్మెంట్ అండ్ స్టాప్ కి శుభాభినందనలు తెలిపినారు..