చంద్రంపాలెం హైస్కూల్లో ఘనంగాచత్రపతి శివాజీ జయంతి.

భీమిలి నియోజకవర్గం (మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) భారతీయ పరాక్రమానికి ప్రతీక చత్రపతి శివాజీ అని చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గొట్టేటి రవి అన్నారు. బుధవారం పాఠశాలలో చత్రపతి శివాజీ జయంతి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహిస్తున్న భాష ఉత్సవాల్లో భాగంగా "హిందీ భాషా దినోత్సవం" హిందీ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యంలో మన తల్లులు బూచాడు వస్తాడు, దొంగోడు వస్తాడు అని భయపడటం నేర్పుతుంటే 1930 లలోనే శివాజీ తల్లి జిజియాబాయి ఆయనకు ధైర్యాన్ని నూరిపోసి, భయమంటే తెలియని విధంగా పెంచిందని, అందుకే ఆయన సాహస వీరుడు అయ్యాడని అన్నారు హిందీ భాషా దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ కరెన్సీ నోటు పైన ఉన్న భాషలన్నీ జాతీయ భాషలే అని, అందులో హిందీకి దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగానూ ప్రత్యేక గుర్తింపు ఉందని విద్యార్థులు అందరూ రాష్ట్ర నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. విద్యార్థులు హిందీ భాషలో ప్రదర్శించిన స్కిట్స్, గీతాలు, పిపిటి ప్రజెంటేషన్లు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన ప్రకృత్వ పద్య పఠన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హిందీ విభాగాధిపతి జీకేఎం లక్ష్మి, ఉపాధ్యాయులు వర్ధిని, సత్యవతి, రాజేశ్వరి, జి. రాము, పుష్ప, ప్రసన్నకుమారి, ఫిసికల్ డైరెక్టర్ రాము తదితరులు పాల్గొన్నారు.