భీమిలి క్రాస్ రోడ్ లో గంజాయితో ఆటో పట్టివేత. ముగ్గురు వ్యక్తులు అరెస్టు.
February 25, 2025
భీమిలి క్రాస్ రోడ్ వద్ద 26 కేజీలు గంజాయి పట్టివేత.
(భీమిలి నియోజకవర్గం,ఆనందపురం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
ఆనందపురం మండలం, భీమిలి క్రాస్ రోడ్డు వద్ద
26 కిలోల గంజాయి ఆటోలో ముగ్గురు వ్యక్తులు తీసుకువెళుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం భీమిలి క్రాస్ రోడ్ లో వాహనాలు ముమ్మరంగా చెక్ చేయడంతో టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ భరత్ కు అందిన సమాచారం మేరకు ఆటోను పట్టుకొని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అరుకు నుంచి బయలుదేరిన ఆటో ఆనందపురం భీమిలి క్రాస్ రోడ్ దగ్గర దొరకటంతో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేసి ఆటోని సీజ్ చేశారు. ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.