సాయిరాం కాలనీలో ఘనంగా కనకదుర్గాంబిక 23వ జాతర మహోత్సవాలు.
March 10, 2025
సాయిరాంకాలనీలో ఘనంగా శ్రీ కనకదుర్గాంబిక 23వ జాతర మహోత్సవాలు.
ప్రత్యేక పూజలు చేసిన5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత, టిడిపి రాష్ట్ర నాయకులు మొల్లి లక్ష్మణరావు.
జీవీఎంసీ,
(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
మధురవాడ,కొమ్మాది జంక్షన్ సాయిరాం కాలనీలో వెలసి యున్న శ్రీకనకదుర్గంబిక 23వ జాతర మహోత్సవాలు (9/3/2025 ఆదివారం నుండి11/3/2025 మంగళవారం వరకు) ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత దంపతులు, టిడిపి రాష్ట్ర నాయకులు మొల్లి లక్ష్మణరావు హాజరై అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.అమ్మవారి చాటింపు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ అధ్యక్షులు కరుమోజి గోవిందరావు పర్యవేక్షణలో అఖండ దుర్గా హోమాన్ని నిర్వహించారు.సాయంత్రం బాల బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. అమ్మవారికి పేరంటాలు కలశాలతో నీటిని తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గం: అధ్యక్షులు యస్. శ్రీనివాస్ నాయుడు, అధ్యక్షులు కురుమోజి గోవిందరావు, ఉపాధ్యక్షులు వై. ఎస్. మూర్తి, కార్యదర్శి బోడసింగి సింహాచలం, కోశాధికారి మూల దుర్గారావు,
జాయింట్ సెక్రటరీ పిన్నింటి గంగరాజు, జాయింట్ కోశాధికారి బోనంగి జగదీష్
ఆర్గనైజింగ్ సెక్రటరీ నరవ ధనుంజయ్, పబ్లిసిటీ సెక్రటరీ
కె. మహేష్, ఎ.నారాయణరావు,
ముఖ్య సలహాదారులు : బి.వి.జి నాయుడు, జి. యోగేశ్వరరావు,యస్. వైకుంఠరావు, సి.హెచ్ రమణ, రోణంకి నారాయణరావు, బొడ్డేపల్లి శ్యామలరావు, పెట్ల దుర్గా ప్రసాద్.. తదితరుల ఆధ్వర్యంలో సాయిరాం కాలనీ కనకదుర్గంబిక జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.