వైభవంగా నూకాలమ్మ అమ్మవారి ఆలయం పున: ప్రతిష్ట మహోత్సవం

వైభవోపేతంగా శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం పునః ప్రతిష్టా మహోత్సవం. - శాస్త్రోక్తముగా యంత్ర విగ్రహ పూర్ణకలశ ప్రతిష్ఠ, విగ్రహ ఆవిష్కరణ, ప్రాణ ప్రతిష్ఠ , మహా పూర్ణాహుతి, అమ్మవారి దర్శనం - మధురవాడ, ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) విశాఖ నగరంలోని మధురవాడ ,మిధిలాపురి ఉడా కోలని ,బింద్రానగర్,షిప్ యార్డు లే అవుట్ లో అత్యంత వైభవోపేతంగా శ్రీశ్రీశ్రీ విజయగణపతి, ఏకశిల నాగాభరణ, శివలింగము,శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ సంతాన నాగేంద్ర స్వామి, శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునః ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించారు.. ఈనెల 7వ తేదీ నుండి శ్రీ నూకంబిక అమ్మవారి ఆలయ సమూహ వన ప్రతిష్ట మహోత్సవములను బ్రహ్మశ్రీ దార్లపూడి సీతారామ శర్మ,బ్రహ్మశ్రీ ఇప్పిలి సాయికిరణ్ శర్మ,బ్రహ్మశ్రీ అర్జింగి జగదీశ్వర్ ల పర్యవేక్షణ, నిర్వహణలో బ్రహ్మశ్రీ దార్లపూడి సీతారామ శర్మగారి ఆధ్వర్యములో 12 మంది వేద పండితులతో పునః ప్రతిష్టా మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించారు.. అందులో భాగంగా .సోమవారం సుప్రభాతసేవ, వేదపారాయణ, దీక్షాదారులచే యంత్ర విగ్రహ పూర్ణకలశ ప్రతిష్ఠ, విగ్రహ ఆవిష్కరణ, ప్రాణ ప్రతిష్ఠ , మహా పూర్ణాహుతి, అమ్మవారి దర్శనం, అవబృత స్నానం,వేద ఆశీర్వచనం, పండిత సత్కారం జరిపారు . మధ్యాహ్నం 12 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో మహా అన్నసమారాధ జరిపారు. సాయంత్రం 5 లకు తిరుపతి వాస్తవ్యులు డాక్టర్ మల్లంపల్లి భద్రకాళీ చే “దేవి వైభవము” ప్రవచన కార్యక్రమము తదుపరి సాంస్కృత కార్యక్రమము పిల్లలచే నిర్వహించారు.. ఈ మహోత్సవ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తుల పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించినట్టు శ్రీ నూకంబిక ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపారు.