అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం 35 వేల రూపాయలు చేయాలి.--- సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జే వి ఎస్ ఎన్ డిమాండ్.

కనీస వేతనం 35 వేల రూపాయలు ఇవ్వాల్సిందే - సిపిఐ నేత జె వి ఎస్ ఎన్ మూర్తి డిమాండ్ విశాఖపట్నం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) ఈ దేశంలో సంపద సృష్టికర్తలైన అసంఘటితరంగ కార్మికులకు కనీస వేతనం 35 వేల రూపాయలు చెల్లించాలని ఏఐటీయూసీ విశాఖపట్నం హార్బర్ పోర్టు వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు, సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ జిల్లా సమితి ఏర్పాటు చేసిన మహా ధర్నా ను ప్రారంభించి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కార్మిక చట్టాలను కట్టిదిట్టంగా అమలు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యుటి సెలవులు అన్ని సౌకర్యాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు పూనుకోవాలని డిమాండ్ చేశారు. ఈధర్నాలో కాంట్రాక్టు లేబర్, ఆటో, డ్రైవర్స్, ముఠా కార్మికులు, మెడికల్ ఎంప్లాయిస్, చిల్లర వర్తకులు, భవన నిర్మాణ కార్మికులు, ఆర్టీసీ పోటర్స్, రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్, సివిల్ సప్లై హమాలీలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కనీస వేతనం అసంఘటతరంగ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 35 వేల రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిచో వారి కుటుంబాలు పోషణ కష్టమవుతుందని తెలియజేశారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో 50 కోట్ల మంది గా ఉన్న అసంఘటతరంగా కార్మికులకు ఒక సామాజిక భద్రతతో కూడిన చట్టాన్ని రూపొందించాలని కనీస స్పృహ లేకుండా ఈరోజు పాలన సాగిస్తుందని తెలియజేశారు. అనేక పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలు ఈ దేశంలో 44 చాన్నాళ్ల నుండి అమలవుతున్నప్పటికీ వాటిని ఈ మధ్యకాలంలో రద్దుచేసి యజమానులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని దీనివల్ల కార్మికులు సమ్మె చేసే హక్కును కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని తీవ్రంగా విమర్శించారు. ఈ కోడ్ వల్ల సంఘాల ఏర్పాటు చేసుకునే హక్కులు కూడా కోల్పోయే ప్రమాదాలు అసంఘటితరంగా కార్మికులకు రానున్న కాలములో పరిస్థితులు దాపరిస్తాయని దానివల్ల చాలా గడ్డు పరిస్థితులు రాబోతున్నాయని అందువల్ల తక్షణం ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అసంఘటితరంగా కార్మికులకు ఉన్న పీఎఫ్ ఈఎస్ఐ సెలవులు గ్రాడ్ డ్యూటీ ఇతర సౌకర్యాలు అన్ని అమలు చేయాలని లేనిచో భవిష్యత్తులో మరిన్ని సమరసిల పోరాటాలకు ఏఐటియుసి సన్నెత్తమవుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేయడం జరిగింది. ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎం. మన్మధరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా లో జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జే అచ్యుతరావు, గౌరవ అధ్యక్షులు బి సి హెచ్ మసీన్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బి వెంకట్రావు, ఉపాధ్యక్షులు ఎస్కే రెహిమాన్, జెడి నాయుడు, జె రామకృష్ణ, కసిరెడ్డి సత్యనారాయణ, కె సత్తిబాబు, పి చంద్రశేఖర్, పడాల గోవిందు, సిహెచ్ కాసుబాబు, ఎన్ నాగభూషణం, ఆనంద్, జె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.