సాయిరాం కాలనీలో శ్రీ కనకదుర్గాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన భీమిలి వైసిపి సమన్వయకర్త మజ్జిచిన్న శ్రీను.
March 11, 2025
సాయిరాం కాలనీ శ్రీ కనక దుర్గాంబిక జాతర మహోత్సవాల్లో భీమిలి వైసిపి ఇన్చార్జ్ చిన్న శ్రీను.
(మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
భీమిలి నియోజకవర్గం, 5 వ వార్డ్ కొమ్మాది,సాయిరాం కొలనీలో శ్రీ కనక దుర్గాంబిక అమ్మవారి 23వ జాతర మహోత్సవాల్లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు , భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి చిన్న శ్రీను మంగళవారం సాయంత్రం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు చిన్న శ్రీను కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో5 వ వార్డ్ వైసిపి అధ్యక్షులు పోతిన హనుమంత రావు, వైయస్. మూర్తి బి, శేమలరావు శ్రీ నివాసునాయుడు , బి సింహాచలం, గంగ రాజు, మహేష్,
కుమార్, రాంబాబు, చిన్నా,
రాంబాబు , జగదీష్ , తదితరులు పాల్గొన్నారు.