ప్రాధాన్యతాపరంగా,అంచెలంచెలుగా మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, మాజీ మంత్రి భీమిలిఎమ్మెల్యే గంటా ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి పథంలో 5వ వార్డ్ --- రింగ్ విద్యుత్ ద్వీపాలు ప్రారంభించిన కార్పొరేటర్ హేమలత.
March 14, 2025
ఐదవ వార్డ్ లో రింగ్‌ఫోల్ లైట్ల వెలుగులు
వీధి దీపాల సమస్య శాశ్వత పరిష్కారానికై ప్రత్యేక దృష్టి
_5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత_
జీవీఎంసీ,(న్యూ వైజాగ్ మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను)
:ఐదవ వార్డ్ లో వీధి దీపాల శాశ్వత పరిష్కారం నకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. శుక్రవారం సాయంత్రం 5 వ వార్డ్ పరిది బోరవానిపాలెం అంబేద్కర్ కాలనీ, జే ఎన్ ఎన్ యు ఆర్ ఎమ్ పి2 కాలనీ, వికలాంగుల కాలనీ, స్వతంత్రనగర్,ఎన్టీఆర్ హుదూద్ కాలనీ తదితర ప్రాంతాల్లో సుమారు 5 లక్షల వ్యయం తో మంజూరు అయిన రింగ్ ఫోల్ లైట్లు ను కార్పొరేటర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...వార్డ్ లో వీధి లైట్లు సమస్య చాల ఎక్కువుగా ఉందని చాల సార్లు కౌన్సిల్ సమావేశాలలో మరియు జీవీఎంసి కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగిందని,స్థానిక శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు చొరవతో సుమారు ఐదు లక్షల వ్యయం తో మంజూరు అయిన 5 రింగ్ ఫోల్ లైట్లును వార్డులో గల ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని, ఇంకా వార్డ్ లో సుమారు మూడువందల విద్యుత్ స్తంభాలకు క్రొత్త వీధి లైట్లు అమర్చవలసి ఉందని, దశల వారీగా అన్ని విద్యుత్ స్తంభాలకు వీధి లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమం లో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, జీవీఎంసీ ఇన్చార్జి ఎలక్ట్రికల్ ఏఈ గాయత్రి,భీమిలి టిడిపి మహిళ అధ్యక్షురాలు బోయి రమాదేవి,యువత అధ్యక్షులు కొండపూ రాజు, కొత్తల శ్రీనివాసరావు,జోగేశ్వర పాత్రో,బోని నరసింహామూర్తి,ఈశ్వరమ్మ, ప్రసాద్, ఇరోతి అప్పారావు, శ్రీను,రాజా,అప్పారావు, సూర్యనారాయణ, అడ్డూరు అప్పారావు, మహాలక్ష్మి నాయుడు, రవి, పిర్రి అప్పలరాజు,వర్క్ ఇన్స్పెక్టర్ కృష్ణ, శ్రీను కాలనీల పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.