ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి... పర్యావరణాన్ని పరిరక్షించండి -- 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ పిలుపు.
March 15, 2025
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పై అవగాహన --- ప్లాస్టిక్ నియంత్రించండి పర్యావరణాన్ని పరిరక్షించండి.
బయో కవర్లు వాడండి.- కార్పొరేటర్ మంగమ్మ పిలుపు.
మధురవాడ.
(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను )
7వ వార్డు మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద (పీహెచ్సీ)
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శనివారం ఉదయం నిర్వహించారు.
7 వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ పిళ్ళా మంగమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వాడకంపర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ప్రజలకు అవగాహన ఏర్పాటు చేశారు. వ్యాపార దుకాణాలు వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వాడవద్దు అని సూచిస్తూ బయో కవర్లు వాడాలని సూచనలిచ్చారు. ప్లాస్టిక్ వంటి వాటి వల్ల వచ్చే ఇబ్బందులని తెలియజేశారు. తరువాత హాస్పిటల్ లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో భాగం గా హాస్పిటల్ పర్యావరణం శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏం హెచ్ ఓ కిషోర్ జోన్ 2, శ్రీనివాస్ రాజు జోన్ 2 ప్రవీణ్ వార్డు సానిటరీ ఇన్స్పెక్టర్ సంతోష్ శానిటరీ సెక్రటరీ లు ఆర్పీ లు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు...