పీ ఎం పాలెం సమితి కన్వీనర్ ప్రభాకర్ సాయి దూత ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమాలయంలో ఘనంగా శ్రీ లక్ష్మీదేవి జయంతి. ప్రత్యేక పూజలు.

విశాఖ,పీఎం పాలెం సమితి కన్వీనర్ ప్రభాకర్ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ లక్ష్మీదేవి జయంతి. మధురవాడ, పీఎం పాలెం
(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను.) న్యూ వైజాగ్ పీఎం పాలెం సత్య సాయి ప్రేమాలయం, భగవాన్ శ్రీ సత్య సాయి మందిరంలో పీఎం పాలెం సమితి ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ లక్ష్మీదేవి జయంతి ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు లక్ష్మీ గణేష్ గాయత్రి హోమం, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. కన్వీనర్ సాయి దూత ప్రభాకర్ పర్యవేక్షణలో నిత్య నగర్ సంకీర్తన, తో పాటు భగవాన్ శ్రీ సత్య సాయి నూరువ జన్మదినోత్సవ సందర్భంగా నిత్య నామ సంకీర్తన, నిత్య నారాయణ సేవ నిర్విరామంగా కొనసాగుతున్నాయి.