చంద్రంపాలెం హైస్కూల్లో 68 మందిమంది విద్యార్థులకు ఉచిత కళ్లద్దాలు పంపిణీ.
March 01, 2025
మధురవాడ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను).
విద్యార్థుల విద్యా వికాసానికి కంటిచూపు ఎంతో ప్రాముఖ్యమైనదని, చంద్రంపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గొట్టేటి రవికుమార్ పేర్కొన్నారు. శనివారం
విశాఖపట్నం జిల్లా ప్రాంతీయ నేత్ర వైద్య ఆసుపత్రి, విశాఖ నేత్ర వైద్య ఆసుపత్రి సహకారంతో అక్టోబర్ నెలలో చంద్రంపాలెం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన, వైద్య పరీక్షల ఆధారంగా 68 మంది విద్యార్థులకు కళ్లజోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రాంతీయనేత్ర వైద్యశాల ప్రతినిధి కళ్ళజోళ్ళని హై స్కూల్ కి అందజేశారని. వాటిని పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు. విద్యార్థులకు ప్రతి ఏడాది కంటి చూపు పరీక్షలు నిర్వహించి వారి పుస్తక పఠనానికి, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలవకుండా , ఆరోగ్యంగా ఉండేందుకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామన్నారు. విద్యార్థులు భవిష్యత్తు తమకు ముఖ్యమని వారికి మంచి జరిగే విధంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.