ఘనంగా అంతర్జాతీయ టైలర్ల దినోత్సవం.. కీర్తి చందనకు ఘన సత్కారం.

(మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను) అంతర్జాతీయ టైలర్ల దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి సూచన మేరకు వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఎంవిపి కాలనీ సెక్టార్ 8 లో నివాసముంటున్న మన ఆర్యవైశ్య బిడ్డ బండారు కీర్తి చందన (పెరల్ ఫ్యాషన్స్)తన స్వశక్తితో గత 20 సంవత్సరములుగా టైలర్ వృత్తిలో వుంటూ ప్రస్తుతం 4 గురుకి ఉపాధి కల్పించిన లేడీస్ టైలర్ కీర్తిచందన ను సాలువతో సత్కరించి ,ఒక గిఫ్ట్ హాంపర్ బహుకరించడమైనది.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు Vn ఏ వి రామకృష్ణ రావు, ఉపాధ్యక్షులు Vn K. శ్రీనివాసరావు, ఫాస్ట్ ప్రెసిడెంట్ మల్లేశ్వర గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ పాల్గొన్నారు.