ఆరువ వార్డులో అన్నా క్యాంటీన్ పెట్టాలి..... టిడిపి వార్డు అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు
March 08, 2025
ఆరో వార్డులో అన్న క్యాంటీన్ పెట్టాలి.. ఆరవ టిడిపి అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు.
(మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) అత్యధిక జనాభా విశాఖలోనే అన్ని వార్డులు కన్నా ఎక్కువ ఓటింగ్ ఉన్న ప్రాంతంలో అన్న కాంటీన్ పెట్టడం వలన ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. కొమ్మాది నేషనల్ హైవే పక్కన అమ్మవారి గుడి పక్కన స్థలంలో గాని పీఎం పాలెం కార్ షెడ్డు ప్రాంతంలో గాని అన్న క్యాంటీన్ పెడితే అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి నిత్యం పని గురించి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ పనులు వస్తు ఉంటారు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. శాసనసభ్యులు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మీ ప్రాంతంలో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని మాట ఇచ్చారు.
దాసరి శ్రీనివాస్
ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
విశాఖ పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి..