ఘనంగా జీవీఎంసీ ఆరు వవార్డు కార్పొరేటర్ డాక్టర్ లక్ష్మీ ప్రియాంక జన్మదిన వేడుకలు.. భీమిలి నియోజకవర్గం సీనియర్ నేత ము త్తంశెట్టి మహేష్ కేక్ కటింగ్, నిత్యావసర సరుకులు పంపిణీ..
May 11, 2025
ఘనంగా ముత్తంశెట్టి.లక్ష్మీప్రియాంక జన్మదిన వేడుకలు.--- ముఖ్య అతిథిగా భీమిలి సీనియర్ నేత మహేష్. కేక్ కటింగ్.
భీమిలి నియోజకవర్గ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
మాజీ మంత్రి వర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముద్దులకుమార్తె
6 వవార్డు కార్పొరేటర్ డాక్టర్ లక్ష్మి ప్రియాంక పుట్టిన రోజు సందర్భంగా స్థానిక ఎస్ ఓ ఎస్ చిల్డ్రన్ హోం నందు పుట్టిన రోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గం సీనియర్ నేత, అవంతి విద్యాసంస్థల లో ఒక బాధ్యుడైన అవంతికి, లక్ష్మణ స్వామి లాంటి ముత్తంశెట్టి మహేష్ హాజరై పిల్లలతో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు.
అదే విధంగా సుమారు 20 వేల రూపాయల నిత్యావసర సరుకుల వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవంతి అభిమానులు కదిరి జగన్నాధం యెచ్చర్ల హరి, గొరిపల్లి సన్యాసిరావు, కోండ్రు రామసూరప్పడు, నాగరాజు,బొండా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
🌹పలుచోట్ల సేవా కార్యక్రమాలు... ఎక్స్ నగరాల డైరెక్టర్ లోహిత్ ..🌹 వైజాగ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కళానగర్, ఆనంద మార్గ చిల్డ్రన్ హోమ్,ఆదర్శనగర్ డైరీ ఫారం, వనప్రస్థానం ఓల్డ్ ఏజ్ హోమ్ కంచరపాలెం, మన కుటుంబం చిల్డ్రన్ హోమ్ ఓల్డ్ డైరీ ఫారం. లలో అన్నదాన కార్యక్రమం నిత్యవసర వస్తువులు, ఎక్స్ స్టేట్ నగరాల కార్పొరేషన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ లోహిత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేశారు.