భీమిలి మధురవాడ మరో మాదాపూర్, గచ్చిబౌలిలఅభివృద్ధి -- ఎక్స్ మినిస్టర్ భీమిలి ఎమ్మెల్యే గంటా.

ఆతిథ్య రంగానికి ఉజ్వల భవిష్యత్ భీమిలి ఎమ్మెల్యే గంటా. భీమిలి నియోజకవర్గం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :మధురవాడ. విశాఖలో ఆతిథ్య రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం వి -కన్వెన్షన్ లో జరిగిన ఇంటర్ హోటల్స్ క్రికెట్ టోర్నమెంట్ విజేతల బహుమతి ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అన్నవరంలో ఒబెరాయ్, మేఫెయిర్ వంటి ప్రముఖ కంపెనీలు సహా విశాఖలో కొత్తగా 20 నుంచి 25 స్టార్ హోటల్స్ రాబోతున్నాయని తెలిపారు. 2026 జూన్ నాటికి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత హోటల్స్, రిసార్ట్స్, వెల్ నెస్ సెంటర్ల కు డిమాండ్ పెరుగుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో భీమిలి, మధురవాడ ప్రాంతం హైదరాబాద్ లో మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల మాదిరిగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. భీమిలి నియోజకవర్గం కోసం తయారు చేస్తున్న విజన్ డాక్యుమెంట్ లో ఆతిథ్య రంగానికి సంబంధించి పొందుపర్చాల్సిన అంశాలను తెలియజేయాలని కోరారు. టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన పామ్ బీచ్, భీమిలి వరుణ్ బీచ్ హోటల్స్ కు గంటా ట్రోఫీలను అందించారు. కార్యక్రమంలో ఆతిధ్యరంగ ప్రతినిధులు కార్తీక్, విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు.