ధర్మపురి పైడితల్లి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించిన విజయనగరం చిన్న శీను కుటుంబం.
May 27, 2025
విజయనగరం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ. విశాఖ)
పైడితల్లి అమ్మవారికి చల్లదనం చేసిన జెడ్పి చైర్ పర్సన్ చిన్న శ్రీను కుటుంబ o
,
ధర్మపురి,
విజయనగరం.
27 మే నెల 2025, మంగళవారం, నగర పాలక సంస్థ, విజయనగరం లోని తన స్వగ్రామమైన ధర్మపురి నందు వెలసిన శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని
ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి.జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం వై.యస్.ఆర్.సీ.పి సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) సతీమణి శ్రీమతి మజ్జి పుష్పాంజలి అల్లుడు ప్రదీప్ నాయుడు,కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ), పాల్గొని అమ్మ వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రములు పసుపు, కుంకుమలు అమ్మవారికి సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలి అని కోరుకున్నామన్నారు. ధర్మపురి ఆలయం అభివృద్ధి జరుగుతుందని, అవసరమైన పక్షంలో ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు.