ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి ఎన్ ఇరుకుల్ల రామకృష్ణ బర్తడే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు.

విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) జై వాసవి.. జై జై వాసవి తేదీ10.06.2025 మంగళవారం వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులైన వాసవియన్ ఇరుకుల్ల రామకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ నిర్వహణలో జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్.ఏ.డి.జంక్షన్ దగ్గర లో గల నిరాశ్రయుల వసతి గృహం నందు అనాధ ఆశ్రమంలో వయో వృద్ధులకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు , వస్త్ర దానం... ప్రతి ఒక్కరికి టవల్స్ (తువాళ్లు) ఇవ్వడం జరిగినది. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఒకరికి రక్తదానం అవసరమై క్లబ్బు దగ్గర ఉన్న ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ డోనర్స్ కార్డ్ ఒకరికి ఇచ్చారు. ఈ సందర్భంగా.క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకట రామకృష్ణారావు మాట్లాడుతూ అంతర్జాతీయ అధ్యక్షులు వారు ఇంకా ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు రూపొందించి మా అందరి చేత చేయించే అవకాశాన్ని కల్పించాలని ఆ శక్తి,యుక్తి, భక్తి వాసవి మాత అంతర్జాతీయ అధ్యక్షులు వారికి ప్రసాదించాలని, క్లబ్ సభ్యులు అందరూ తరఫున మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ... ఈ కార్యక్రమంలో వాసవియన్లు ,కార్యదర్శి వెంకటరమణమూర్తి, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా పాల్గొన్నారు.