ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ షెల్టర్ లో వృద్ధులకు అల్పాహారం. ఏర్పాటు.
June 07, 2025
జై వాసవి .జై జై వాసవి..
విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
వాసవీ క్లబ్ ఎం.వి.పి.కపుల్స్ ఆధ్వర్యంలో తేది 07-06-2025 న శనివారం ఉదయం రాజేశ్వరి జ్ఞాపకార్ధం వాసవియన్ జల్లూరి లక్ష్మీ సహకారంతో పెద్ద వాల్తేరు,దలై వారి వీధి లో వున్న రెడ్ క్రాస్ షెల్టర్ లో నిరాశ్రయులైన వయోవృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమములో క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకట రామకృష్ణారావు,వాసవియన్లు ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, హరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.