గట్టా వారి ఆర్థిక సహాయంతో ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులురామకృష్ణ ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు.
June 13, 2025
జై వాసవి. జై జై వాసవి. వాసవి క్లబ్
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానoశ్రీను మధురవాడ
ఎం.వి.పి.కపుల్స్ ఆధ్వర్యంలో గురువారం... తేది... 12-06-2025 న సాయంత్రం 7 గంటల30 నిమిషములకు
కీర్తిశేషులు ఎస్.అర్.గట్టా జ్ఞాపకార్ధం టి.ఎస్.అర్. కాంప్లెక్స్ (వైభవ్ జువెల్లెర్స్ ఎదురుగా)ఏ.యూ.టి.డి. షెల్టర్ లో వున్న నిరాశ్రుయులైన వారికి డాక్టర్స్ ప్రకాష్ గట్టా , కామేశ్వరి గట్టా, ఇంజనీర్ రఘు గట్టా దాతల ఆర్థిక సహకారంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వాసవియన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకట రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివరామకృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు,చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ, పాస్ట్ ప్రెసిడెంట్ లు మల్లేశ్వర గుప్తా, గ్రంధి కృష్ణారావు, హరగోపాల్ మొదలైన వారు పాల్గొన్నారు. అదేవిధంగా రైల్వే హై స్కూల్ నందు శాశ్వత ప్రాజెక్టుగా నిర్మించిన లావెట్రీస్, బాత్రూములలో పిల్లల సౌకర్యార్థం 14 ప్లాస్టిక్ బకెట్లు మరియు 14 మగ్గులు ఇవ్వడం జరిగింది.