చంద్రంపాలెంపంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు..

శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి కి విశేష పూజలు.! భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకునిగా ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో జ్యేష్ట మాసం కృష్ణ పక్షం షష్ఠి మంగళవారం సందర్భంగా స్వామివారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం పూల మాలలు తులసి మాలలు, వడ మాలలతో అలంకరణ అనంతరం సింధూర అర్చన, తమలార్చన, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, హరి స్వామి తదితరులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు, శ్రీ దుర్గాలమ్మ ఆలయ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా సూరిబాబు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు సభ్యులు పిళ్లా వెంకటరమణ, పిళ్లా రమణ, పిళ్లా పోతరాజు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.