ఆధ్యాత్మిక సేవలో సిరమ్మ. వెంకన్న బాబుకు, బంగారమ్మకు ప్రత్యేక పూజలు.

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం త్రయాహ్నిక చతుష్కoడాత్మక ప్రతిష్టా శుభాహ్వానం లో సిరి సహస్ర (సిరమ్మ) (విజయనగరం) భీమిలి నియోజకవర్గ0 ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) (9502817542) తే 03.06.2025 దీ, పుణ్యతిరుమల గిరి క్షేత్రం యస్. కోట. మండలం , యస్. కోట.మండలం, పుణ్యగిరి క్షేత్రం మంగళవారం పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పుణ్య తిరుమలగిరి క్షేత్రం త్రయాహ్ని క చతుష్కాoడాత్మక ప్రతిష్టా మహోత్సవ శుభాహ్వానం ఊరేగింపు సందర్భంగా శృంగవరపుకోట యమ్. ఎల్. సి. శ్రీ ఇందుకూరు రఘురాజు ఆహ్వానం మేరకు విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వై.యస్.ఆర్.సీ.పీ. జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ ) శ్రీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.ముందుగా ఉత్సవ కమిటీ పెద్దలు సిరమ్మకు సాదర స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రాలతో ఆలయ పూజారులు సిరమ్మను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి శ్రీ ఇందుకూరు రఘు రాజు, ఏ. పి. టూరిజం డైరెక్టర్ శ్రీమతి ఇందుకూరి సుధారాణి స్థానిక నాయకులు, చిన్న శ్రీనుసోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. *అదేవిధంగా భీమిలి నియోజకవర్గం లో మంగళవారం పద్మనాభం మండలం తాలాడ గ్రామంలో శ్రీ శ్రీ బంగారమ్మ తల్లి అమ్మవారి పండగ సందర్భంగా గ్రామస్తులు పిలుపుమేరకు ఆ తల్లి నీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గ్రామ పెద్దలుసిరమ్మ ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.