విశాఖ జిల్లా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శతమానం భవతి, 12 జంటలకు వివాహ ఆమోదం,, 170 మంది బయోడేటా రిజిస్ట్రేషన్.. శతమానoభవతి కి విశేష స్పందన.

జిల్లా వాసవి క్లబ్ ఆధ్వర్యం లో శతమానం భవతి.. విశాఖ సిటీ(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.) ____________________వాసవి క్లబ్ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం లో ఆర్య వైశ్యుల పునర్వి వివాహ, ఆలస్య వివాహ మరియు దివ్యాంగుల కు శతమానం భవతి అనే కార్యక్రమంలో వివాహ పరిచయ వేదికను యుగంధర్ గారి నేతృత్వం లో జిల్లా గవర్నర్ అమర్నాథ్ ఆధ్వర్యం లో నిర్వహించారు. అతిధులుగా గ్రంధి రాంజీ, తమ్మన భాస్కర్,పులవర్తి శ్రీనివాసరావు తమ సందేశాన్ని వినిపించారు. సుమారు 170 మంది తమ బయోడేటాలను అందించి పరిచయం చేసుకున్నారు. ఒక పన్నెండు జంటలవరకు తమ ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో చందన, సాయినిర్మల,శైలజా,మానస,రమేష్, ప్రసాద్ మున్నగు వారు పాల్గొన్నారు