మధురవాడ ప్రెస్ క్లబ్ లో తొలిసారి ప్రెస్ మీట్. శ్రీవెంకటేశ్వర విద్యాపీఠ్, ఆంధ్ర యూనివర్సిటీ దూరవిద్య కోర్సులు,... ప్రెస్మీట్లో పాల్గొనని సగం మంది విలేకరులు... ప్రెస్ మీట్ ను వదిలేసి తప్పించుకు తిరిగిన ప్రెస్ క్లబ్ ప్రధాన బాధ్యులు..

శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ్ లో ఏయూ దూరవిద్యా కోర్సులు. విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ. మధురవాడ, భీమిలీ పరిసర ప్రజలలో అక్షరాస్యత పెంపొందించే ఉద్దేశంతో గత సంవత్సరం నుండి ఆంధ్రా యూనివర్సిటీ అనుమతితో చదవులో ఆసక్తి గల గృహిణిలు,మధ్యలో చదువు ఆపేసిన వారు... తిరిగి చదువు కొనసాగించేందుకు దూర విధ్యా కోర్సులు అన్నింటిని అతి తక్కువ ఫీజులతో కరస్పాండెన్స్,రెగ్యులర్ ద్వారా ఎస్ ఎస్ సీ,బి ఈడ్, డి ఈడ్ కోర్సులు శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ్, నగరపాలెం రోడ్డు, మధురవాడలో అందుబాటులో ఉంటాయని చైర్మన్ వై.వెంకటేశ్వర్లు అన్నారు. గ్రేటర్ విశాఖ మధురవాడ శివశక్తినగర్ రోడ్డు లోగల ప్రెస్ క్లబ్ లో అయన మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 14 సంవత్సరాలు దాటిన పిల్లలకు, చదవగలిగే ఉత్సాహం ఉన్న వారందరికీ ఏపిఓఎస్ఎస్ ద్వారా ఎస్ఎస్సి మరియు ఇంటర్ పరీక్షకు పంపిస్తున్నామన్నారు. అలాగే 15 సంవత్సరాలు దాటిన వారందరికీ, టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు రెండు సంవత్సరాలు చదివే ఇంటర్మీడియట్ కోర్సును ఒక్క సంవత్సరంలో వన్ సిట్టింగ్ ద్వారా పూర్తి చేసుకునే విధానాన్ని కూడ ముందుకు తీసుకు వచ్చాము అని తెలిపారు. ఉద్యోగస్తులకు దూరవిద్య ద్వారా యూజీ, పీజీ కోర్సులను అందిస్తున్నామని, ప్రధానంగా మీడియా కొరకు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం కోర్స్ కూడా అందులో ఉందని పేర్కొన్నారు. టీచర్స్ శిక్షణ కోర్సులు, బీఈడీ, డిఈడి ఇంగ్లీష్ మీడియం కోర్సులను ప్రవేశపెట్టి ఎంతో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణను ఇప్పిస్తున్నామన్నారు. సమాజంలో ఒక కొత్త యుగాన్ని, ఒక నవశకాన్ని తయారుచేసి అధ్యాపకులను రేపటి తరానికి అందించాలనేది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. రాబోయే సెప్టెంబర్ 5న కూటమి ప్రభుత్వం వెలువరించే మెగా డీఎస్సీలో ఫలితాలలో అల్లూరి జిల్లా, విజయనగరం, విశాఖలో అత్యధిక ఉపాధ్యాయ పోస్టులను అందుకునే ఏకైక విద్యాసంస్థగా నిల్చుంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు.ఈ అవకాశం సద్వినియోగం చేసుకునేందుకు ఎక్కువమంది ఔత్సాహికులకు ఈప్రకటన చేరేలా కృషి చేయాలని మీడియాని కోరారు. మరిన్ని వివరాలకు చరవాణి సంఖ్య 7386000590ను సంప్రదించాలని కోరారు. అనంతరం, సంస్థ ఆఫర్ చేయబోవు దూర విద్యా కోర్సులు గోడ పత్రిక విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కెవిఎస్ శ్రీనివాసరావు,పి.తిరుపతిరావు, స్కూల్ ఇన్చార్జ్ ఏ స్వాతి, దూరవిద్య ఇంచార్జ్ ఆర్ పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు.