రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన పిల్ల లకుపెద్ద దిక్కుగా నిలిచిన పీ.ఎం పా.లెం పోలీసులు. 1,58,000. రూపాయలు.ఆర్థిక సహాయం, ఎస్సై భాస్కర్ ను అభినందించిన నార్త్ ఎసిపి అప్పలరాజు, సిఐ బాలకృష్ణ. హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు.
July 22, 2025
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పెయింటర్ శంకర్రావు కుటుంబానికి 1,58,000 ఆర్థిక సహకారం అందించిన పీఎం పాలెం పోలీసులు. ఏసిపి అప్పలరాజు చేతుల మీదగా అందజేత.. ఎస్సై భాస్కర్ ను అభినందించిన ఏసిపి. తో పాటు సిఐ బాలకృష్ణ. హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు.
విశాఖ సిటీ,మధురవాడ, -- ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను )
రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఓ మృతుని కుటుంబానికి పీఎం పాలెం పోలీసులు పెద్దదిక్కుగా ఉండి తమ వాట్సాప్ స్టేటస్ సహకారంతో ఆర్థిక సహాయాన్ని సమకూర్చి ఒక లక్ష యాభై ఎనిమిది వేల రూపాయల ధన సహాయం చేశారు. ఎస్సై భాస్కర్ తన వాట్సాప్ స్టేటస్ లో మృతుని కుటుంబాన్ని తండ్రి కోల్పోయిన పిల్లలను చూపి దాతల సహకారం కోరడంతో తమ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున స్పందించింది. దీంతో ఏసిపి అప్పలరాజు, సిఐ బాలకృష్ణ చేతుల మీదగా వసూలు అయిన మొత్తాన్ని ఈనెల 17న రాజీవ్ గృహకల్ప కు చెందిన పొట్నూర్ శంకర్రావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కుటుంబానికి పీఎం పాలెం పోలీస్ స్టేషన్కు పిలిపించి మృతుని భార్య పిల్లలకు అందజేశారు. మానవతా దృక్పథంతో ఇంత పెద్ద ఆర్థిక సహకారాన్ని అందించిన పీఎం పాలెం పోలీసులకు స్థానికంగా హర్షం వ్యక్తం అవుతుంది. ఎస్సై భాస్కర్ ను ఏసీపీ అప్పలరాజు సిఐ బాలకృష్ణ అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను చూసి వాట్సాప్ స్టేటస్ సోషల్ మీడియా ద్వారా ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు సేవలు అందించడానికి ఎస్ఐ భాస్కర్ ఆదర్శనీడిగా నిలిచారు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు సోషల్ మీడియాను ఉపయోగించడం ద్వారా ఆయన అందరి మదిలో నిలిచారు. స్థానికంగా హర్షం వ్యక్తం అవుతుంది.